తెలంగాణలో గులాబీ పార్టీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో అనూహ్యంగా బలోపేతం అవుతూ వస్తున్న కమలం పార్టీ…తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. తమకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా…టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ మరింత దూకుడుగా ముందుకెళుతుంది…ఓ వైపు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలని ఎండగడుతూనే…మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గాల వారీగా బలపడే దిశగా కమలదళం పనిచేస్తుంది.
బండి సంజయ్…ప్రతీనెల 20 రోజులు ప్రజా సంగ్రామ యాత్ర, పది రోజులపాటు ప్రజా గోస-బీజేపీ భరోసా పేరిట బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. తాజాగా సిద్ధిపేటలో ప్రజా గోస కార్యక్రమాన్ని ప్రాంభించారు. ఇక ఇతర నేతలు…తమ తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ ర్యాలీ ద్వారా ప్రజలతో మమేకమవుతూ…వారి సమస్యలని తెలుసుకుని, వాటిపై పోరాటం చేయనున్నారు. అలాగే సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేసే దిశగా ఈ ర్యాలీలు ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే బీజేపీ ఏదొక విధంగా కారు పార్టీకి చుక్కలు చూపిస్తూనే ఉంది..ఇక ఈ ప్రజా గోస కార్యక్రమంతో..కారు పార్టీలో ఇంకా సెగలు రేగనున్నాయని చెప్పొచ్చు.