బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైడ్రా పై సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. హైడ్రా పేరుతో వందలు, వేల కోట్ల వసూళ్లు జరుగుతున్నాయి.. ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందా?? అంటూ నిలదీశారు. హైడ్రా కొరలు పీకేసి, కొలాప్స్ చేశారని ఆగ్రహించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పదవులు రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. బీఆర్‌ఎస్ రెబల్ ఎమ్మెల్యేలపై హై కోర్టు ఇచ్చిన తీర్పు ను స్వాగతిస్తున్నామని… చారిత్రాత్మక మైన తీర్పు, అధికారపార్టీ కి చెంపపెట్టు అన్నారు. ఫిరాయింపులు చట్ట విరుద్ధం అని కోర్టు పేర్కొందని వివరించారు. పొన్నం ప్రభాకర్ స్వాగతించారు… స్వాగతించడం కాదు అమలు చేయాలని కోరుతున్నానని తెలిపారు.