విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేయాలని కార్మికులు ఆందోళన

-

ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. విశాఖపట్నంలోని కూర్మన్న పాలెం కూడలిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ, నిర్వాసితుల రాస్తారోకోలో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరీని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో నేషనల్ హైవేను దిగ్భందించారు. రోడ్డు పై బైఠాయించి కార్మికులు నిరసన చేపట్టడంతో కూర్మన్నపాలెంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని డిమాండ్ చేసారు. హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా కేంద్రం నిర్ణం తీసుకోలేదని కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలతో పోలీసులు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news