తునీషా ఆత్మహత్యపై బీజేపీ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు

-

బాలీవుడ్ యువ నటి తునీషా శర్మ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. సహ నటుడు, బాయ్ ఫ్రెండ్ షీజాన్ ఖాన్ తో బ్రేకప్ కావడం వల్లే మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు నిందితుడు షీజాన్ ఖాన్ ను అరెస్ట్ చేసి ముంబయిలోని వాసాయ్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు నిందితుడికి నాలుగు రోజుల కస్టడీ విధించింది. అయితే.. తునీషా శర్మ ఆత్మహత్యపై బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆత్మహత్య వెనక లవ్ జిహాద్ కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని అన్నారు.

దర్యాప్తులో అసలు విషయం వెల్లడవుతుందని, తునీషా కుటుంబ సభ్యులకు నూటికి నూరుశాతం న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇది లవ్ జిహాద్ అయితే పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తారని అన్నారు. దీని వెనకున్న కుట్రదారులు ఎవరు? ఏయే సంస్థలు ఉన్నాయన్న విషయాలు కూడా బయటపడతాయని పేర్కొన్నారు. కాగా, ‘అలీ బాబా: దాస్తాన్-ఈ-కాబూల్’ టీవీ షో సెట్స్‌లో తునిషా శర్మ నిన్న ఆత్మహత్య చేసుకుంది. తునీషా, ఖాన్ మధ్య
రిలేషన్‌షిప్ ఉందని, వీరిద్దరూ రెండు వారాల క్రితం విడిపోయారని తునీషా తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్యకు అదే కారణం కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version