బీటెక్ పూర్తి చేసినవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసేయండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ లో మొత్తం 250 సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు ఖాళీలు వున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక సాలరీ విషయానికి వస్తే.. ఎంపికైన వాళ్లకి నెలకు రూ. 35000 జీతంగా అందిస్తారు. ఇక అర్హత వివరాలని చూస్తే.. అభ్యర్థులు 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ (కంప్యూటర్/ ఐటీ) ప్యాస్ అయ్యి ఉండాలి.

ఇక సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ లో ఎంపికైన వాళ్ళు గాంధీనగర్, న్యూఢిల్లీ లో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసేందుకు చివరి తేదీ 03-01-2023. పూర్తి వివరాలని https://bisag-n.gov.in/ లో చూసి అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version