గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట నియోజకవర్గాల్లో తప్పితే ఎక్కడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత నుంచి ఈ రోజు దాకా ఏ సబ్ స్టేషన్ కు 24 గంటలు త్రిఫేజ్ కరెంట్ ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. 20 సంవత్సరాల క్రితమే రిటైర్ అయిన వ్యక్తిని కీలక స్థానంలో నియమించి నిజాలు బయటపడకుండా చేస్తున్నారని విమర్శించారు. కీలక స్థానాలన్ని రిటైర్ ఉద్యోగులకు ఎందుకు ప్రభుత్వం ఇస్తుందని ప్రశ్నించారు.
గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటలో తప్పితే ఎక్కడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు: రఘునందన్ రావు
-