ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు కాంగ్రెస్ కి ఉరితాళ్ళు కాబోతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ హామీలను అమలు చేయమని స్వయంగా చెప్పడం కాంగ్రెస్ మోస పూరిత వైఖరి బహిర్గతం అయ్యింది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆర్ధిక పరిస్థితి తెలియక హామీలు ఇచ్చామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెబుతున్నారు. ఎన్నికల్లో గట్టెక్కడానికి గడ్డి తిన్నారు.. అమలు చేయమంటే అర్ధిక స్థితి బాగాలేదని సాకులు చూపుతున్నారు. ప్రజలు తిరగబడుతున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. హామీలు అమలు చేయండి లేకపోతే దిగిపోండి.
రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చాలా మంది రైతులకి విస్మరించారు. మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు ఆ ఊసే లేదు. హామీలు ఇచ్చి మోంది చెయ్యి చూపితే బీజేపీ ఊరుకోదు. హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మోసాలను గుర్తించి తగిన గుణపాఠం చెప్పారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకువస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఏడాది కింద 8వేల మంది పదవి విరమణ పొందితే.. రిటైర్మేమెంట్ బేనిపిట్స్ ఇవ్వలేదు. పదవి విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా ఉంది. కాబట్టి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రేకులు వేయాలి. బీజేపీ అభ్యర్ధులకు ఓటు వేసి గెలిపించండి.. మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.