ప్రధాని పెట్టిన వికసిత భారత్ విజన్ లక్ష్యం సాధన దిశగా స్టీల్ మంత్రిత్వ శాఖ పని చేస్తోంది అని ఉక్కు శాఖ మంత్రి HD కుమార్ స్వామి అన్నారు. ప్రస్తుతం 35 వేల కోట్లు అప్పులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఉన్నాయి. గత ఆరు నెలల కాలంలో ఏపీ CM చంద్రబాబు, లోకేష్ అనేక మార్లు ఈ సమస్య పరిష్కారం కోసం ఒత్తిడి చేస్తూ వచ్చారు. అయితే మా అభ్యర్థనలను ప్రధాని మోదీ అంగీకరించారు. మొదటి దశ లో NPA నుంచి బయట పడేందుకు కేంద్ర ఫైనాన్స్ మంత్రి నిధుల విడుదల చేశారు.
NPA సమస్యను పరిష్కరించిన తర్వాత రెండు ఫార్మేసులు సమర్ధవంతంగా నిర్వహించడంలో కార్మికులు విజయవంతం అయ్యారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంటు సమర్ధవంతంగా పనిచేస్తోంది. కార్మికులకు ఉన్న ఇబ్బందులు తెలుసు. ప్యాకేజ్ సమర్ధవంత వినియోగంపై రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం. అందులో భాగంగానే ప్లాంట్ విజిట్ చేశాను. వైజాగ్ స్టీల్ సమర్ధవంతంగా నిర్వహించి నంబర్ వన్ ప్లాంట్ గా మారుస్తాం. కార్మికుల సమస్యలను మూడు నెలలలో పరిష్కరిస్తాం.. సహకరించమని కోరాను.. అందుకు యూనియన్లు అంగీకరించాయి. 15 రోజుల్లో వర్కింగ్ ప్లాన్ ప్రకటిస్తాం అని ఉక్కు శాఖ మంత్రి అన్నారు.