బీజేపీ పవర్‌లోకి రావాలంటే ఇలా చేయాలి : ఎమ్మెల్యే రాజాసింగ్

-

రాష్ట్రంలో బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడనే వార్త ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే స్టేట్ నూతన చీఫ్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు రాబోతున్నారని వివరించారు.

కానీ,ప్రెసిడెంట్‌ను స్టేట్ కమిటీనే డిసైడ్ చేస్తే ఆయన ఓ రబ్బర్ స్టాంప్‌లానే ఉంటారని కామెంట్ చేశారు.అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా.. అది సెంట్రల్ కమిటీనే నిర్ణయించాలన్నారు.గతంలో కొంతమంది గ్రూపిజం కారణంగా పార్టీకి తీరని నష్టం వాటిల్లిందన్నారు. కొందరు మంచి నాయకులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేల చేతులను కట్టేశారని ఆరోపించారు. ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. కొత్తగా వచ్చే అధ్యక్షుడు సీక్రెట్ మీటింగ్స్ పెట్టొద్దని..ధర్మం గురించి పని చేసే వారికి మాత్రమే ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news