గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో పలుమార్లు రాత్రి పవర్ కూడా పోయింది. కొన్ని చోట్ల చెట్లు కూడా విరిగిపడ్డాయి.ఈ క్రమంలోనే పాతబస్తీలో రాత్రి కురిసిన చిన్న వర్షానికి ఓల్డ్ సిటీ, న్యూ సిటీలో రాత్రి 12 గంటలకు కరెంట్ పోతే ఇప్పటివరకు రాలేదని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు.
రాత్రి కరెంట్ లేకపోవడంతో ఉపవాసాలు ఉండే వాళ్ళకి ఇబ్బందులు కలిగాయని, చిన్న వర్షానికి ఇంత ఇబ్బంది వస్తే ఎలా?.. ప్రభుత్వం దగ్గర కరెంట్ పోయిన వెంటనే రీ స్టోర్ చేయడానికి సరైన మెకానిజం ఉందా? అని యాకుత్ పురా ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ప్రభుత్వాన్ని ప్రస్తావించారు.