హుజూర్ నగర్ ఎన్నికల తర్వాత బీజేపీ తెలంగాణ విషయంలో వ్యూహం మార్చిందా…?

-

హుజూర్ నగర్ ఎన్నికలు ఎవరికి ఏం సమాధానం చెప్పాయి తెలియదు గాని… కేంద్రంలో అధికారంలో ఉండి… తెలంగాణాలో బలపడాలని భావించిన భారతీయ జనతా పార్టీకి మాత్రం… చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకకుండానే… ప్రశ్నలను దాటవేసే పరిస్థితి తీసుకొచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు… హుజూర్ నగర్ ఎన్నికలకు ముందు బిజెపి ముందున్న లక్ష్యం… తెలంగాణాలో అధికారం చేపట్టడమే, అమిత్ షా కూడా రాష్ట్ర నేతలకు ఇదే విషయాన్ని చెప్పారని వ్యాఖ్యానించడం అందరిని ఆశ్చర్యం కలిగించింది. కానీ ఎన్నికల తర్వాత మాత్రం,

రాష్ట్రంలో బిజెపి బలపడే విషయంలో ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మీడియా గాని బీజేపీ నేతలు గాని దూకుడుగా మాట్లాడిన సందర్భం లేదు. అసలు దీనికి కారణం ఏంటి అనేది ఒకసారి చూస్తే… సోషల్ మీడియాలో గాని, ప్రధాన మీడియాలో గాని నాయకులు విమర్శించే అంత వ్యతిరేకత కెసిఆర్ సర్కార్ మీద లేదనే విషయం బీజేపీకి స్పష్టంగా అర్ధమైంది. ఇక తెరాస నేతలను తమ పార్టీలోకి తీసుకుని బలపడిపోదాం… సత్తా చాటేద్దాం అనుకున్న వాళ్లకు ఎన్నికల తర్వాత వ్యూహం మార్చాలని అర్ధమైంది… ముందుగా ప్రాంతాలను లక్ష్యంగా,

హుజూర్ నగర్ ఎన్నికల తర్వాత బీజేపీ తెలంగాణ విషయంలో వ్యూహం మార్చిందా…?

ఆ తర్వాత తమ వ్యూహాలను అమలు చెయ్యాలని బిజెపి భావిస్తుంది. అందులో భాగంగానే… తెలంగాణను దేశ రెండో రాజధాని, లేదా కేంద్ర పాలిత ప్రాంతం అనే ప్రచారం తీసుకొచ్చింది. అదే జరిగితే కెసిఆర్ బలహీనపడతారు కాబట్టి తమ వ్యూహాన్ని అమలు చేయవచ్చని, తెలంగాణకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది కాబట్టి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని… బిజెపి భావిస్తుంది. ప్రజా వ్యతిరేకత అనేది అంచనా వేయడానికి లేదని, ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే లాభపడవచ్చని బీజేపీ భావిస్తుంది. అదే జరిగితే తెలంగాణాలో… తెరాస మీద ఆగ్రహంగా ఉన్న ఆంధ్రా వాళ్ళు కూడా బీజేపీ కి సహకరించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version