ఏపీ బీజేపీ నేత‌ల శోక‌ణ్ణాలు ఇప్పుడు విన‌ప‌డ‌వేం…!

-

ఏపీలో గ‌డిచిన వారం రోజులుగా సాగుతున్న హాట్ టాపిక్.. ఇంగ్లీష్ మీడియం. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ శాల‌ల్లో వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి ఇంగ్లీష్ మీడియంనే అమ‌లు చేస్తామ‌ని, ఈ విష‌యంలో ఆరు నూ రైనా తాము ప‌ట్టించుకోబోమ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలోఈ విష‌యం రా జ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఒక‌ప‌క్క విప‌క్షాలు ముక్త‌కంఠంతో తెలుగు మీడియం కొన‌సాగించా ల్సిందేన‌ని చెప్పారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ అయితే, మ‌రో అడుగు ముందుకు వేసి.. తెలుగు మీడియం తీసేస్తే.. వైసీపీ నాయ‌కులు మ‌ట్టికొట్టుకు పోతార‌ని శాపాలు పెట్టారు.

అదేస‌మ‌యంలో టీడీపీ నాయ‌కుడు చంద్ర‌బాబు ఆదిలో ఒకింత ఘాటుగానే స్పందించినా.. త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వం స్పందించిన తీరుతో ఆయ‌న వెనుక‌డుగు వేశారు. మీ పిల్ల‌లు ఎక్క‌డ చదువుతున్నారు? ఏ మీడి యంలో చ‌దువుతున్నారంటూ.. వారు ప్ర‌శ్నించే స‌రికి ప్ర‌ధానంగా బాబు మ‌న‌వ‌డు దేవాన్ష్‌ను కూడా రాజ‌కీ యాల్లోకి లాగేస‌రికి బాబు మౌనం పాటించారు.

కొంత మెత్త‌బ‌డి.. ఇంగ్లీష్‌తోపాటు తెలుగును కూడా కొన‌సాగిం చాలంటూ.. ముక్తాయిస్తున్నారు. వీరి ప‌రిస్థితి ఇలా ఉంటే.. బీజేపీ ఏం చేస్తోంద‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్ప‌టికే అనేక స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్‌ను ఏకేసిన బీజేపీ జాతీయ నేత‌లు రామ్ మాధ‌వ్‌, విష్ణు వ‌ర్ధ‌న్‌, సుజ‌నా చౌద‌రి వంటి వారు ఇప్పుడు ఇంగ్లీష్ విష‌యంలో మాత్రం మౌనం పాటించారు. గ‌తంలో జ‌గ‌న్ చేప‌ట్టిన పోల‌వ‌రం స‌హా అన్ని ప్రాజెక్టుల రివ‌ర్స్ టెండ‌ర్ల‌పై తీవ్ర‌స్తాయిలో బీజేపీ నేత‌లు స్పందించారు. ఇక‌, విద్యుత్ ఒప్పందాల ర‌ద్దును కూడా ఖండించారు. ఇలా అయితే, రాష్ట్రం వెనుక‌బ‌డి పోతుంద‌ని పెద్ద ఎత్తున శోక‌ణ్నాలు పెట్టారు.

అయితే, ఇప్పుడు ఇంగ్లీష్ విష‌యం వ‌చ్చేస‌రికి మౌనం వ‌హించారు. ఒక్క క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ త‌ప్ప‌.. బీజేపీలోని అంద‌రూ కూడా దీనిని స‌మ‌ర్ధించారు. కానీ, జాతీయ నేత‌లు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు మౌనం వీడ‌లేదు. దీంతో అస‌లు వీరికి దీనిపై ఇంట్ర‌స్ట్ లేదా? లేక తెలుగు అయితే ఏంటి? ఇంగ్లీష్ అయితే ఏంటి? మ‌న‌కు లాభం లేదుక‌దా? అనుకున్నారా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version