ఆ విషయంలో బండి సక్సెస్..ఫ్రస్టేషన్ పెంచారు…!

-

ఏదేమైనా తెలంగాణ సీఎం కేసీఆర్‌ని ప్రజల్లోకి తీసుకురావడంలో బీజేపీ చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా అధ్యక్షుడు బండి సంజయ్…కేసీఆర్‌లోనే ఫ్రస్టేషన్ బయటపడేలా చేశారు. మామూలుగా కేసీఆర్ ప్రజల్లో పెద్దకు రారనే చెప్పాలి. ఎంతసేపు ఫాంహౌస్‌ లేదా ప్రగతి భవన్‌…ఇంకా ఇదే ప్రజల్లోకి వచ్చి కనబడటం చాలా తక్కువ. ఏదో ఎన్నికల సమయంలో మాత్రం బయటకొస్తారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

అలాంటిది ఇప్పుడు కేసీఆర్‌ని రోడ్డు మీదకు తీసుకొచ్చేశారు. ఎప్పుడైతే హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిచారో అప్పటినుంచి కేసీఆర్‌లోని ఫ్రస్టేషన్ అంతా బయటకొచ్చేసింది. మామూలుగా ప్రతిపక్షాలు చేసే విమర్శలకు కేసీఆర్ డైరక్ట్‌గా కౌంటర్లు ఇవ్వరు. టీఆర్ఎస్ తరుపున ఏ మంత్రో, ఎమ్మెల్యేనో మీడియా సమావేశం పెట్టి కౌంటర్ ఇస్తారు. కానీ ఇప్పుడు కేసీఆర్ స్వయంగా మీడియా సమావేశాలు పెడుతూ బండి సంజయ్‌కు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక కేసీఆర్‌లోనే కాదు టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఫ్రస్టేషన్ పెరిగిందని తాజాగా నల్గొండ టూర్‌లో బండి సంజయ్, బీజేపీ శ్రేణులపై జరిగిన దాడులే ఉదాహరణ అని చెప్పొచ్చు. అదేమంటే రైతుల బీజేపీపై కోపంగా ఉన్నారని, అందుకే దాడులు చేశారని కేసీఆర్ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. రైతులే దాడులు చేశారనుకుంటే…వారు ముందే రాళ్ళు, కోడి గుడ్లు రెడీ చేసుకుని పెట్టుకున్నారా?అనేది డౌట్ రావొచ్చు. ఎందుకంటే వాళ్ళు రైతులు కాదు టీఆర్ఎస్ కార్యకర్తలు అని క్లియర్‌గా అర్ధమవుతుంది.

ఇక ధాన్యం కొనుగోలు విషయంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్..ధర్నాలు, ఆందోళనలు చేయడం కాస్త విడ్డూరంగానే ఉంది. ప్రజల్లో వ్యతిరేక వస్తుండటంతో కేసీఆర్ ఇలా రోడ్డుపైకి వచ్చారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ను ఫాంహౌస్‌ నుంచి ప్రగతి భవన్‌కు, అక్కడి నుంచి రోడ్డుపైకి రప్పించామని, ఇక ఆయన వద్దన్న ధర్నాచౌక్‌ వద్దకే తీసుకొచ్చామని బండి మాటలు నిజమే అని చెప్పాలి. మొత్తానికి కేసీఆర్‌ని ప్రజల్లోకి తీసుకురావడంలో బండి సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version