బీజేపీ ‘బాబు’..జనం నమ్ముతారా?

-

అవసరానికి తగ్గట్టుగా రాజకీయం చేయడంలో చంద్రబాబుని మిచిన వారు లేరనే చెప్పాలి..ఆయన సమయం, సందర్భం బట్టి ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారు…అలాగే స్నేహం చేసిన పార్టీతోనే కయ్యం పెట్టుకుంటారు. అంటే బాబు రాజకీయం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారో…అలాగే ఎన్ని పార్టీలని మళ్ళీ వదిలేశారో తెలిసిందే. బీజేపీ, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, జనసేన, టీఆర్ఎస్..ఆఖరికి బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.

అయితే ఇందులో ఎక్కువసార్లు పొత్తు పెట్టుకున్నది బీజేపీ, కమ్యూనిస్టులతోనే. ఇక వీరితో ఎన్ని సార్లు పొత్తుకుని, ఎన్ని సార్లు బయటకొచ్చేశారో చెప్పాల్సిన పని లేదు. ఇక 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో అధికారంలోకి వచ్చిన బాబు…2018లో మళ్ళీ బీజేపీ నుంచి బయటకొచ్చి, మోదీ, అమిత్ షాలపై ఏ స్థాయిలో విమర్శలు చేశారో తెలిసిందే.

ఇక 2019 ఎన్నికల తర్వాత పోరాటాల కోసం సి‌పి‌ఐ పార్టీతో కలిసి మెలిసి కనిపించారు. కానీ నెక్స్ట్ ఏపీలో అధికారంలోకి రావాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సపోర్ట్ కావాలని బాబుకు బాగా తెలుసు…అందుకే ఆ పార్టీకి దగ్గరవ్వడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో అందరికీ తెలుసు. చివరికి బీజేపీకి దగ్గరయ్యే అవకాశాలు బాబుకు మెరుగు పడ్డాయి. నెక్స్ట్ ఎన్నికల్లో జనసేనతో పాటు బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

నిజానికి ఏపీలో బీజేపీకి బలం లేదు…ఒక సీటు కూడా గెలుచుకోలేదు. అయినా సరే ఆ పార్టీ కోసం బాబు పాకులాడేది…కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల. అయితే కేంద్రం సపోర్ట్ ఉంటే ఏపీలో గెలిచేస్తామనే సూత్రం సక్సెస్ అవ్వోచ్చు…అదే సమయంలో ఫెయిల్ అవ్వోచ్చు. ఎందుకంటే ఏపీ ప్రజలు ఇంకా బీజేపీపై ఆగ్రహంతోనే ఉన్నారు…హోదా, విభజన హామీలు అమలు చేయలేదనే కోపం ఉంది. పైగా గతంలో బీజేపీతో పొత్తులో ఉండి బాబు హోదా విషయంలో ఏం చేశారో అందరికీ తెలుసు. ఇలాంటి తరుణంలో బీజేపీతో బాబు కలిసి వెళ్తే ప్రజలు ఎంతవరకు నమ్మి మద్ధతు ఇస్తారనేది తెలియడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version