సీఎం కేసీఆర్ పెద్ద జోకర్ – ఎంపీ అరవింద్

-

సీఎం కేసీఆర్ పెద్ద జోకర్ అని అన్నారు నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. ఎన్నికల ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కెసిఆర్ ఇచ్చిన హామీలను పూర్తి చేయించే బాధ్యత ప్రశాంత్ రెడ్డి దేనన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తానని హామీ ఇచ్చి జిల్లా ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదన్నారు.

జక్రాన్ పల్లి ఎయిర్పోర్ట్ నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, పోడు భూములు ఉన్నవారికి పట్టాలు ఇస్తానన్న వాగ్దానాలను.. కెసిఆర్ గారికి వదిలేశారని మండిపడ్డారు. మంత్రి హరీష్ రావు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన పదవిని కాపాడుకునేందుకే హరీష్ కేంద్రం మీద విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా మంత్రి, తెలంగాణ కోడలు నిర్మల సీతారామన్ మీద పిచ్చికూతలు కూస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేటీఆర్ మత్తులో తూగుతున్నాడని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న కవిత తన పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. కవిత సారా రాణిగా పేరు తెచ్చుకుందని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version