మునుగోడులో కాంగ్రెస్ ను ఓడించే సత్తా ఎవరికీ లేదు : రేవంత్ రెడ్డి

-

మునుగోడు సీటు కాంగ్రెస్ కు దక్కాలంటే రోజుకు రెండు గంటలు గట్టిగా కేటాయిస్తే సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హస్తం కార్యకర్తలంతా కలిసి పనిచేస్తే.. ఏ రాజకీయ పార్టీనైనా ఈజీగా ఓడగొట్టొచ్చని అన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తే మునుగోడు సీటు మనదేనని కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.

కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌ రెడ్డిపై రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజీనామా చేస్తే ఎక్కడైనా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. రాజగోపాల్‌ రెడ్డిని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే.. దాన్ని ఆయన రూ.22 వేల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఓటేయొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

మునుగోడులో 97వేల ఓట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆస్తి అని రేవంత్‌ రెడ్డి అన్నారు. అందరం కలిసి పనిచేస్తే ఎవర్నైనా పడగొట్టచ్చని చెప్పారు. మండల స్థాయి నాయకులు రోజుకు రెండు గంటలు సమయం కేటాయిస్తే విజయం కాంగ్రెస్‌దేనని విశ్వాసం వ్యక్తంచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version