హుజూరా బాద్ ఉప ఎన్నిక : రంగంలోకి టీఆర్‌ఎస్‌ మాజీ లీడర్ ను దించిన బీజేపీ !

-

హుజూరా బాద్ ఉప ఎన్నిక బీజేపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా దుబ్బాక తరహాలో హుజూరాబాద్‌ సీటును దక్కించుకోవడానికి అన్ని స్కెచ్‌లు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ బీజేపీ. హుజూరా బాద్ ఉప ఎన్నికకు ఇంచార్జ్ గా జితేందర్ రెడ్డిని బీజేపీ నియమించింది. జితేందర్ రెడ్డి మాజీ టీఆర్‌ఎస్‌ నేత కావడం విశేషం. అందులోనూ ఈటల రాజేందర్‌తో చాలా సన్నిహితుడు కావడం విశేషం. టీఆర్‌ఎస్‌ ఓటర్లను కూడా బీజేపీ వైపు తిప్పుకోవాలని ఈ నిర్ణయం తీసుకుంది.

అలాగే సహా ఇంచార్జ్ లుగా మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీ నారాయణ నియమించింది బీజేపీ. ఈ సందర్భంగా.. జితేందర్ రెడ్డి, హుజూరా బాద్ ఉప ఎన్నిక బీజేపీ ఇన్ఛార్జ్ జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరా బాద్ ఉప ఎన్నిక గెలుపే ధ్యేయంగా పని చేస్తామని.. అక్కడ గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిందని పేర్కొన్నారు. పాత వారిని కొత్త వారిని కలుపుకొని ముందుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. పెద్ది రెడ్డి మాతోనే ఉన్నాడని.. అన్ని సార్లు కేసీఆర్ డబ్బులు గెలవవని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version