తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బిజెపి మహిళ నేత మేకల శిల్పారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాదు మీరు రేవతి రెడ్డి అని పెట్టుకోండి అంటూ… హాట్ కామెంట్స్ చేశారు బిజెపి మహిళ నేత మేకల శిల్పారెడ్డి. తాజాగా బిజెపి తెలంగాణ కార్యాలయంలో బిజెపి మహిళా నేత మేకల శిల్పారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వైఫల్యాలపై విరుచుకుపడ్డారు శిల్పారెడ్డి.
రేవంత్ రెడ్డి కాదు మీరు రేవతి రెడ్డి అంటూ.. నిప్పులు చెరిగారు. మహిళలకు కొండంత హామీలు ఇచ్చి రవ్వంత అమలు కూడా చేయలేదని.. ఆగ్రహం.. వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మీ పేరును రేవతి రెడ్డి అని మార్చుకుంటే ఎప్పుడైనా మహిళల పట్ల మోసం చేసిన తీరు తెలుస్తుందని.. చురకలు అంటించారు శిల్పారెడ్డి. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం ప్రకటించిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి కాదు మీ పేరు.. రేవతి రెడ్డి
మహిళలకు కొండంత హామీలు ఇచ్చి రవ్వంత అమలు చేయలేదు
రేవంత్ రెడ్డి మీపేరును రేవతి రెడ్డి అని మార్చుకుంటే అప్పుడైనా మహిళల పట్ల మోసం చేసిన తీరు తెలుస్తుంది
– బీజేపీ మహిళా నేత మేకల శిల్పారెడ్డి
#DrMekalaShilpaReddy #BRS #BJP #RevanthReddy… pic.twitter.com/wiEn3r9i7q
— PulseNewsBreaking (@pulsenewsbreak) March 11, 2025