కమ్మ-కాపు ఓట్ల కోసం కమలం ఎత్తులు..చేజిక్కేనా!

-

ఏపీలో బలపడాలని బీజేపీ నానా తిప్పలు పడుతున్న విషయం తెలిసిందే. బీజేపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న ఏపీ ప్రజల మద్ధతు మాత్రం రావడం లేదు. ఎప్పుడైతే కేంద్రంలో బి‌జే‌పి అధికారంలోకి వచ్చి రాష్ట్రం బాగోగులని సరిగ్గా పట్టించుకోకపోవడ…హోదా, విభజన హామీలు లాంటి వాటిని అటకెక్కించడంతో ఏపీ ప్రజలు బి‌జే‌పిని నమ్మడం మానేశారు. అందుకే ఆ పార్టీకి కేవలం ఒక శాతం ఓట్లు కూడా లేకుండా పోయాయి.

అయితే కేంద్రంలో అధికారంలో ఉండటంతో కాస్త రాష్ట్రంలో హడావిడి చేస్తుంది. జనసేనతో పొత్తు పెట్టుకుని బలపడే ప్రయత్నాలు చేసింది గాని..పెద్దగా వర్కౌట్ కాలేదు. రాష్ట్రానికి ఏమి చేయకపోగా, రాజకీయ చిచ్చు మరింత పెంచేలా బి‌జే‌పి వైఖరి కనిపిస్తుంది. దీంతో ఏపీలో బి‌జే‌పికి ఆదరణ లేకుండా పోయింది. అయినా సరే ఎలాగైనా ఏపీపై పట్టు సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలోనే బి‌జే‌పి..కాపు ఓటర్లని టార్గెట్ చేసింది. పవన్‌తో పొత్తు పెట్టుకున్న కాపు ఓటర్లు బి‌జే‌పికి ప్లస్ అవ్వలేదు. అందుకే జి‌వి‌ఎల్ లాంటి వారు కాపు రిజర్వేషన్లని తెరపైకి తీసుకొస్తున్నారు. పైగా పార్లమెంట్ లో కాపు రిజర్వేషన్లు కోసం నాలుగు మాటలు మాట్లాడి.. ఏదో చేసేసినట్లు చూపిస్తున్నారు.

ఇక తాజాగా జి‌వి‌ఎల్ పార్లమెంట్ లో రంగా పేరుని జిల్లాకు పేరుగా పెట్టాలని డిమాండ్ చేసి..అది వైసీపీ చేయట్లేదని, కాబట్టి కేంద్రం పరిధిలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్టుకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇటు తాజాగా విజయవాడ వచ్చి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి..రంగా గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు.

అలా రంగా ద్వారా కాపు ఓట్లకు గేలం వేస్తే..ఇటు వంద రూపాయిలు సిల్వర్ కాయిన్‌పై ఎన్టీఆర్ బొమ్మని వేస్తూ కమ్మ ఓట్లని టార్గెట్ చేశారు. కానీ రాష్ట్రానికి సాయం చేయకుండా ఇలాంటివి చేసినంత మాత్రాన కాపు, కమ్మ ఓట్లు కమలంకు పడతాయని అనుకోవడం అవివేకమే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version