టీడీపీ అధినేత చంద్రబాబు…బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తుంటే..బీజేపీ మాత్రం బాబుని గట్టిగానే టార్గెట్ చేస్తుంది. పాపం ఏ సంబంధం లేని విషయంలో కూడా బాబుని లాగి బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. పోనీ ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేశారంటే అర్ధం ఉంది..కానీ తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు. అయితే చంద్రబాబుని టార్గెట్ చేసి పరోక్షంగా కేసీఆర్-రేవంత్ రెడ్డిలకు చెక్ పెట్టాలని బీజేపీ చూస్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే కేటీఆర్, రేవంత్‌లకు బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది. ప్రధాని మాట్లాడిన మాటలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలకు అర్థం అయినట్టు లేదని, మోదీ తెలంగాణకి వ్యతిరేకమని అంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఫైర్ అయ్యారు. టీఆర్‌ఎస్ తమ మనుగడ కోసం బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని, అలాగే ప్రధానిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్ర విభజన తీరుపై మోదీ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదన్నారు. అయితే గతంలో తెలంగాణ ఏర్పాటుని చంద్రబాబు అడ్డుకున్నారని, ఆ చంద్రబాబే…రేవంత్ రెడ్డిని పెంచి పోషించారని చెప్పి కామెంట్ చేశారు. అంటే చంద్రబాబుని టార్గెట్ చేసి పరోక్షంగా టీఆర్ఎస్, రేవంత్‌లని బీజేపీ ఇరుకున పెట్టాలని చూస్తున్నాట్లు కనిపిస్తోంది.