నెల్లూరు జిల్లా : ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బి.జె.పి. పోటీ చేస్తుందని పేర్కొన్నారు బి.జె.పి.రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అభ్యర్థి ఎవరైనా కావచ్చు అని..కొత్త లేదా పాత వాళ్ళు వుంటారన్నారు. సచివాలయ ఉద్యోగులను పర్మనెంట్ చేయలేదు..ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని స్పష్టం చేశారు.
అందుకే పర్మనెంట్ చేయలేదు..రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం సంక్షేమం పథకాలతో పాటు ఆర్థికంగా బలపడుతుంది..రాష్ట్రంలో సంక్షేమం పేరిట ఆర్థిక దృష్టిని కోర్టులో దొంగతనం జరగడాన్ని నేను ఇప్పుడే చూస్తున్నానని వెల్లడించారు.
నైతికత లేని వాళ్లకు మంత్రి పదవులు జగన్ ఇచ్చారు..ఇద్దరు నేతలు పోటే సమావేశాలు పెట్టి జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారని తెలిపారు.ఇదేం తీరో అర్థం కావడం లేదని..రేషన్ బియ్యాన్ని కృష్ణపట్నం..కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతి చేస్తున్నారన్నారు.ఒంగోలు లో సి.ఎం.జగన్ వస్తున్నారని బి.జె.పి.నేతలను అరెస్ట్ చేయడం దారుణమని..బియ్యం కుంభకోణాన్ని వెలికితీసిన బి.జె.పి.నేతలలపై కేసులు పెడుతూన్నారన్నారు.