నిన్న మొయినాబాద్ లోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ లో డబ్బులు కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే.. ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం 88 సీసీ కెమెరాలలో రికార్డ్ అయిందని సమాచారం అందుతోంది. కొనుగోలు వ్యవహారాన్ని పూర్తిగా వీడియో రికార్డ్ చేసిన పోలీసులు.. దాన్ని గోప్యంగా ఉంచారు.
కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2 నాయకుడితో నంద కుమార్ మాట్లాడించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే… ఫార్మ్ హౌస్ లోని గంట 20 నిమిషాల గలా సీసీ కెమెరా టేప్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక కొనుగోలు గురించి జరిపిన సంభాషణలు ఆడియో రికార్డ్ చేశారు ఎమ్మెల్యేలు. తెలంగాణ తర్వాత ఢిల్లీలో 25 ఎమ్మెల్యేలు, ఆంద్రప్రదేశ్ లో 15 మంది ఎమ్మెల్యేల కొనుగోలు ఉందని ఎమ్మెల్యేలకు మిడియేటర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాలను ఇవాళ సీఎం కేసీఆర్ మీడియాకు చెప్పే ఛాన్స్ ఉంది.