బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ బీజేపీనే : ఎంపీ లక్ష్మణ్

-

 

బీసీల కోసం ప్రధాని మోదీ ఎన్నో పథకాలు తీసుకువచ్చారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. బీసీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ను మోదీ తీసుకువచ్చారని తెలిపారు. అన్ని రకాల వృత్తి కార్మికులకు ప్రత్యేక ఫండ్‌, పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

’50 శాతంపైగా ఉన్న బీసీల కోసం మోదీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పూలే ఆశయాలను నెరవేర్చుతున్నారు. కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం బీసీలను చిన్న చూపు చూసింది. వారి చెప్పు చేతుల్లో ఉండాలని అనుకుంది. ప్రధాని నరేంద్ర మోదీని కులం పేరుతో, చాయ్ అమ్ముకున్నందుకు హేళన చేస్తున్నారు. మోదీ బీసీలకు రిజర్వేషన్​ అమలు చేస్తున్నారు. బీసీలను వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలని అనేక కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ బీసీలను పాలనలో భాగస్వామ్యం కానీయకుండా బీసీ రిజర్వేషన్ కుదించారు. ఒక శాతం ఉన్న సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు ఇచ్చిన సీఎం…50 శాతం పైగా ఉన్న బీసీలకు మూడు ఇచ్చారు. బీసీలకు పెద్దపీట వేసే పార్టీ బీజేపీనే’ అని లక్ష్మణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version