బ్రేకింగ్ : హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో బ్లాక్ బాక్స్ ల‌భ్యం..30 అడుగుల దూరంలో ఎగిరిప‌డ్డ వైనం !

-

హెలికాప్టర్ ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలకు ఈ బ్లాక్ బాక్స్ దొరికింది. ప్రమాద స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు అధికారులు గుర్తించారు. నిన్న రాత్రి నుంచి బ్లాక్ బాక్స్ కోసం వెతకగా.. ఢిల్లీ నుంచి వచ్చిన వారిని అధికారులు బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో బ్లాక్ బాక్స్ ను విశ్లేషణ కోసం ఢిల్లీ బృందం… తీసుకు వెళ్ళింది.

కాగా దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కె ప్రమాదంపై ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో లోక్సభలో కీలక ప్రకటన చేయనున్నారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి.. సందర్భంగా ప్రకటన చేయనున్నారు. కాగా.. నిన్న మ‌ధ్యాహ్నాం స‌మ‌యంలో.. ఈ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో… ఏకంగా.. 13 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు. ఇందులో సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ కుటుంబం ఉండ‌టం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version