బిపిన్ రావత్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ చివరి దృశ్యాలు.. వైరల్.

-

సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు 14 మంది ప్రయాణిస్తున్న MI-15V5 ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడు నీలగిరి కొండల్లో కుప్పకూలడంతో సీడీఎస్ తో సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే హెలికాప్టర్ చివరి క్షణాల్లో దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చివరి క్షణాల్లో హెలికాప్టర్ దట్టమైన పొగమంచులోకి వెళ్లడం అక్కడ ఉన్న వారు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. నీలగిరి ప్రాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇలా వచ్చిన పర్యాటకులు హెలికాప్టర్ శబ్ధం రావడంతో ఆసక్తిగా హెలికాప్టర్ విజువల్స్ తీశారు. ఇలా తీస్తున్న క్రమంలోనే హెలికాప్టర్ ఏదో చెట్టుకు తాకి కుప్పకూలిన శబ్దాలు వచ్చాయి. అప్పటి దాకా రెక్కల శబ్ధంతో భీకరంగా వచ్చిన హెలికాప్టర్.. ఉన్నట్టుండి పెద్ద శబ్ధం తరువాత సైలెంట్ అయింది. అక్కడ హెలికాప్టర్ శబ్దాలను వింటున్న వారుకూడా ఒక్కసారి షాక్ కు లోనయ్యారు. ఎమైంది కూలిపోయిందా .. అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version