బ్లాక్ ఫంగస్ విషయంలో ఇప్పుడు రాష్ట్రాలు అన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తగా చర్యలు చేపడుతుంది. తాజాగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి లేఖ రాసింది. బ్లాక్ ఫంగస్ ని రాష్ట్రాలు అన్నీ కూడా ఆరోగ్య విపత్తుగా పరిగణించాలి అంటూ లేఖ రాసింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలు పెడితే దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా వచ్చి తగ్గిన రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. కరోనా కేసులను కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు ఈ వ్యాధి వస్తుంది.