థ్రిల్లర్‌ మూవీగా ‘బ్లాక్’ : టీజ‌ర్‌తో అంచ‌నాలు పెంచిన ఆది

-

డైలాగ్ కింగ్‌ సాయి కుమార్‌ వారసుడిగా టాలీవుడ్‌ పరిశ్రమలో అడుగు పెట్టారు ఆది. చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నుంచి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది. వరుస సినిమాలతో దూకుడు పెంచాడు. అమరన్‌, కిరాతక, బ్లాక్‌ సినిమాలతో బీజీగా ఉన్నాడు ఆది. వెరైటీ కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. తాజాగా బ్లాక్‌ సినిమా నుంచి టీజర్‌ విడుదలైంది.

యాక్షన్‌ సీన్స్‌ పై కట్‌ చేసిన టీజర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉంది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆది పోలీసు పాత్రలో కనిపించనున్నాడు. గతంలో కంటే ఇప్పుడు స్టైల్‌ పూర్తిగా మార్చేశాడు హీరో ఆది. మహంకాళి మూవీస్‌ బ్యానర్‌ పై రూపొందుతోన్న ఈ సినిమాను జీబీ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాతో బెంగాలీ నటి దర్శన హీరోయిన్‌ గా పరిచయమవుతోంది. ఈ సినిమా ను త్వరలోనే రిలీజ్‌ చేయనున్నారు.ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news