కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీ రాహుల్ గాంధీకి ట్విట్టర్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తాజాగా ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ను డిలీట్ చేసింది ట్విట్టర్. రాహుల్ గాంధీ చేసిన ఈ ట్వీట్ లో లైంగిక దాడికి గురైన బాలిక తల్లిదండ్రుల చిత్రాన్ని షేర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
బుధవారం.. ఢిల్లీలో మైనర్ పై అత్యాచారం మరియు హత్య ఘటన అనంతరం.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీ రాహుల్ గాంధీ.. ఆ బాధిత కుటుంబాన్ని కలిశారు. ఈ సమావేశం అనంతరం.. అతను తన ట్విట్టర్ లో ఒక ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటోలో బాధితురాలి తల్లిదండ్రులు కూడా కనిపించారు. ఈ నేపథ్యంలోనే జాతీయ బాలల హక్కుల కమిషన్ ఈ ట్విట్టర్ హ్యాండిల్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ చిత్రాన్ని ట్విట్టర్ లో షేర్ చేయడం బాలల హక్కుల మరియు పోక్సో చట్టాల ఉల్లంఘనగా పేర్కొంది ట్విట్టర్. దీంతో ట్విట్టర్ ఆ ట్వీట్ డిలీట్ చేసింది.
हारेगा वो हर बाज़ी जब निकलेंगे हम साथ में! #SansadGherao pic.twitter.com/nxAPBNmeS1
— Rahul Gandhi (@RahulGandhi) August 5, 2021