బ్రేకింగ్ : నైజిరీయాలో భారీ పేలుడు.. 100 మంది మృతి

-

ఆఫ్రికా దేశంలోని నైజీరియాలో గల చమురు శుద్ధి ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ పేలుడు సంభవించడంతో 100 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. భారీగా ప్రాణ నష్టం జరిగిందని.. మృతదేహాలు గుర్తు పట్టలేనంతంగా కాలిపోయాయని అధికారులు వెల్లడించారు. కర్మాగారంలో సిబ్బంది అంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగిందని, దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు.

అక్కడికక్కడే చాలా మంది మరణించగా, మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు తెలిపారు. అయితే నైజీరియాలో ఈ తరహా అక్రమ చమురు శుద్ధి కర్మాగారాలు చాలా ఉన్నాయి. ముడి చమురును పైప్‌లైన్స్ ధ్వంసం చేసి దొంగిలించి, ఇలాంటి కర్మాగారాల్లో శుద్ధి చేసి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. నైజీరియాలోనే కాకుండా ఆఫ్రికా దేశాల్లో ఈ తరహా ఇల్లీగల్ ఆయిల్ రిఫైనరీలు చాలానే జరుగుతుంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version