బ్లాస్ట్ టీ 20 సెమీఫైనల్ : తడబడుతున్న హాంప్ షైర్ … పట్టుబిగిస్తోన్న ఎస్సెక్స్ !

-

ఈ రోజుతో ఇంగ్లాండ్ దేశవాళీ టీ 20 లీగ్ విటాలిటీ బ్లాస్ట్ పూర్తి కానుంది, కాసేపటి క్రితమే ఎస్సెక్స్ మరియు హాంప్ షైర్ జట్ల మద్యన మొదటి సెమీఫైనల్ లో టాస్ గెలిచిన ఎస్సెక్స్ కెప్టెన్ సైమన్ హార్మర్ బౌలింగ్ ఎంచుకున్నాడు, అనంతరం బ్యాటింగ్ కు దిగిన హాంప్ షైర్ జట్టు మొదటి రెండు ఓవర్ లలో బౌలర్లను ఊచకోత కోసింది. కానీ అదే ఊపును కొనసాగించడంలో విఫలం అయ్యి త్వర త్వరగా నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఓపెనర్లు బెన్ మేక్ డెర్మాట్ , విన్స్, టామ్ మరియు డాసన్ లు అవుట్ అయ్యారు. ప్రస్తుతం 12 ఓవర్ ల అనంతరం 92 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు రెండవ సెమీఫైనల్ లో గెలిచిన జట్టుతో ఇదే రోజు రాత్రి ఫైనల్ ను ఆడుతుంది. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ మ్యాచ్ లో హాంప్ షైర్ పట్టు వదులుతోంది అనిపిస్తోంది.

 

ఎస్సెక్స్ కు గెలిచే అవకాశాలు ఎక్కువగా లున్నాయి, కానీ హాంప్ షైర్ సరిగా బౌలింగ్ చేయగలిగితే నిలువరించే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఈ పిచ్ పైన ఎస్సెక్స్ ముందు ఎంత టార్గెట్ ను ఉంచుతుందో తెలియాలంటే మరికాసేపు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news