హైదరాబాద్‌ లో కలకలం.. ఓ కారులో బయటపడ్డ మృతదేహం

-

హైదరాబాద్‌ లో దారుణం చోటు చేసుకుంది. ఓ కారులో మృతదేహం బయటపడింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ మణికొండ లోని ఓ కారులో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. తాజాగా మారుతి కారులో మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. ఈ తరుణంలోనే…డయల్‌ 100కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.

body found in a car

దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుంది నార్సింగ్ పోలీసులు & క్లూస్ టీమ్. ఇక కారులో మృతదేహం వెలికితీశారు పోలీసులు. అనంతరం ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చనిపోయిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు నెంబరు ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. స్థానికంగా ఉన్న సిసి టీవీ ఫూటేజ్ ను పరిశీలీస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version