బోయినపల్లి అభిషేక్ రావు సిబిఐ కస్టడీ పొడగింపు

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ అరెస్టు చేసిన బోయినపల్లి అభిషేక్ రావు కస్టడీని పొడిగించారు. ఇవాల్టితో అభిషేక్ రావు కస్టడీ ముగియగా.. మరో రెండు రోజులు కస్టడీ పొడగిస్తూ సిబిఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అభిషేక్ రావుతో పాటు పలువురిని విచారిస్తున్నారు సీబీఐ, ఈడి అధికారులు. లిక్కర్ స్కాం లో అరెస్టయిన అభిషేక్ ను మూడు రోజుల పాటూ విచారించింది ఈడి. అభిషేక్ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు అధికారులు.

మరో రెండు రోజులు కస్టడీ పొడిగించాలనీ సిబిఐ కోరింది. లిక్కర్ స్కాం లో రామచంద్ర అరుణ్ పిళ్లై ని విచారించాల్సిన అవసరం ఉందని.. అరుణ్ పిలైతో అభిషేక్ కు ఆర్ధిక సంబంధాలు ఉన్నాయని సిబిఐ వెల్లడించింది. అరుణ్ పిళ్లై ని విచారించేందుకు నోటీసులు ఇచ్చామని తెలిపింది. అభిషేక్ కొన్ని విషయాలకు సమాధానాలు ఇవ్వటం లేదని పేర్కొంది. ఈ మూడు రోజుల కస్టడీలో సిబిఐ అభిషేక్ రావు నుంచి పలు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version