బాలీవుడ్ లో ఇర్ఫాన్ ఖాన్ మరణాన్ని జీర్ణించుకోక ముందే మరో అగ్ర నటుడు కన్ను మూశారు. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ తుదిశ్వాస విడిచారు. ముంబై లోని రిలయన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడం తో గురువారం ఉదయం కన్ను మూశారు. ఆయన ఆరోగ్య మంగళవారం విషమించడం తో ఆయన్ను ముంబైలోని ఆస్పత్రిలో జాయిన్ చేసారు.
ఆయన వయసు 67 ఏళ్ళు కాగా… గత కొన్నాళ్ళు గా క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.అలనాటి బాలీవుడ్ దిగ్గజ హీరో రాజ్ కపూర్ కుమారుడు ఆయన. పలు విజయవంతమైన చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు. ప్రస్తుతం ఆయన హీరోలకు తండ్రి గా సహా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2013 లో ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు.
ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నా సరే ఫలితం లేకుండా పోయింది. కోలుకున్నట్టే కోలుకుని మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టింది. కొన్ని రోజులుగా ఆయన ముంబై లోనే చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఆరోగ్యం విషమించడం తో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా నిన్నటి నుంచి ఆరోగ్యం క్రమంగా విషమించింది. ఆయన వెంట భార్య కుమారుడు, సోదరుడు ఉన్నారు.