Aryan Khan: షారుఖ్‌కు మ‌రోసారి చుక్కెదురు.. ఆర్యన్ కు దొరకని బెయిల్!

-

Aryan Khan: మ‌రోసారి డ్రగ్స్‌ వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్న మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) ఇప్పటికే చాలా మంది సెల‌బ్రెటీల‌ను విచారణకు పిలిచింది. మ‌రికొంద‌రికి సమన్లు జారీ చేయడం కలకలం రేపింది. ఈ త‌రుణంలోనే బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వినియోగిస్తూ రెడ్ హ్యాండేడ్ గా ప‌ట్టుకున్న విష‌యం తెలిసిందే.. దీంతో ఆయ‌న‌ను అక్టోబర్ 2 న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది.

ఆ త‌రువాత 14 రోజుల జ్యూడిషియ‌ల్ క‌స్టడీ విధిస్తూ… ఆర్థర్ రోడ్ జైలుకు త‌ర‌లించారు. అయితే.. ఆర్య‌న్ ఖాన్ ను బ‌య‌ట‌కు తీసుక‌రావ‌డానికి ఆయ‌న త‌రుఫు లాయ‌ర్లు పదేపదే ప్రయత్నించినప్పటికీ, ఆర్యన్ బెయిల్ పిటిషన్ పదేపదే తిరస్కరణకు గురవుతోంది. తాజాగా మ‌రోసారి.. ఆర్య‌న్ త‌రుపు న్యాయ‌వాదులు బెయిల్ కోసం ప్ర‌య‌త్నించారు. సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ ముందుగానే ఆశాభావం వ్యక్తం చేశారు.

కానీ ప్ర‌త్యేక కోర్టు షాక్ ఇచ్చింది. అత‌ని బెయిల్ పిటిష‌న్ పై ప్ర‌త్యేక కోర్టు విచారించి బెయిల్ ఇవ్వ‌లేమంటూ తెల్చిచెప్పింది. మిగిలిన అన్ని బెయిల్ దరఖాస్తులలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రత్యుత్తరాలను దాఖలు చేస్తుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా జూనియర్ కోర్టుకు తెలియజేశారు.

ఇదిలా ఉంటే.. బ‌ర్న్ విత్ గోల్డెన్ స్పున్ గా ఆర్యన్ చిన్నతనంనుంచి రాజభోగాలు అనుభవించాడు. కానీ క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా జైలులో నరకయాతన అనుభవిస్తున్నాడు. స‌రిగా ఆహారం తీసుకోకుండా.. కేవ‌లం బికెట్స్ మాత్రం తింటున్నాడు. ఇక కొడుకు జైలు జీవితం అనుభవిస్తుండటంతో షారుఖ్ దంపతులు బయట కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version