వినాయకుడి కంటే మద్యం షాపులు ముఖ్యమా జగన్ గారూ…?

-

ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు జరిగితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా డీజీపీ పట్టించుకోవడం లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతుందని ప్రధానికి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేయగానే డీజీపీ స్పందించటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేసారు. జగన్ ఎన్నికల ముందు డ్వాక్రా గ్రూపులకి ఏడు లక్షలు ఇస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు మాట మార్చి మహిళలకు టోపీ పెట్టారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా నివాస స్ధలాల కొనుగోలు లో జరిగిన అవినీతిపై బహిరంగ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. పేదల ఇళ్ళస్ధలాల పంపిణి తెదేపా అడ్డుకుంటుందని వైసీపీ నేతలు చేస్తున్న విష ప్రచారం పై మేము బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి గ్రూప్ కి 7లక్షల రూపాయలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని, హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తుందని, మద్యం షాప్ లకు లేని కోవిడ్ నిబందనలు వినాయక చవితి వేడుకలకి ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బ్రాందీ షాపులకు ఇచ్చిన ప్రాధాన్యత హిందువుల తొలి పండుగ అయిన వినాయక చవితికి ఎందుకు ఇవ్వటం లేదని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version