ముందస్తు ఎన్నికలకు అనుమతివ్వాలని జగన్ ఢిల్లీ పెద్దలను కోరుతున్నారు : బొండా ఉమ

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖలు చేశారు. ముందస్తు ఎన్నికలకు అనుమతివ్వాలని జగన్ ఢిల్లీ పెద్దలను కోరుతున్నారు. డిసెంబరులోనే జగన్ అసెంబ్లీని డిజాల్వ్ చేసే పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది మే నెలలో ఎన్నికలు జరుపుకునే అవకాశం కల్పించాలని ఢిల్లీ పెద్దలను జగన్ కోరుతోన్నట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలు పెట్టేందుకు కేంద్రం ఒప్పుకోకున్నా.. కాళ్లు పట్టుకుని ఒప్పించే సత్తా జగనుకుంది. ముందస్తు కోసం జగన్.. మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నాడు. పాలన కొనసాగించే ఆర్థిక పరిస్థితి జగన్ ప్రభుత్వంలో లేదు. స్కీములకే కాదు.. ఉద్యోగులకు జీతాలూ ఇవ్వలేని పరిస్థితి ఏపీలో ఉంది. అప్పులతో పీకల్లోతులో కూరుకున్న రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి జగన్ వైపు నుంచి కన్పించడం లేదు. తన మీదున్న సీబీఐ, ఈడీ కేసుల రాజీ కోసం ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నారు. వైఎస్ వివేకా హత్య కేసును జగన్ నిర్వీర్యం చేస్తున్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం.. ఏకంగా సీబీఐ జగన్ పైనే దాడులు చేస్తున్నారు.

వివేకా హత్య కేసు విచారణ జరుగుతున్న తీరును సొంత చెల్లి షర్మిళ కూడా తప్పు పట్టారు. సీఎం జగన్ సొంత చెల్లి.. తల్లి చెప్పింది కూడా అబద్దమేనా..? వివేకా హత్య కేసు విచారణ పక్క రాష్ట్రానికి పంపారు. సొంత ఫ్యామ్లీకే అన్యాయం చేసిన జగన్.. రాష్ట్ర ప్రజలకేం చేస్తారు. జగనుకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తోంది. యువతకు ఉపాధి లేకుండా పోయింది. జగన్ ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఏమైంది..? మూడున్నరేళ్లల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించారా..? ప్రతేడాది మెగా డీఎస్సీ వేస్తానన్న జగన్.. ఎన్ని మెగా డీఎస్సీలు వేశారు..? నిరుద్యోగ యువతకి ఆర్ధికంగా అభివృద్ధి చేస్తానని.. కాంట్రాక్టులు ఇస్తానన్న వైసీపీ హామీ ఏమైంది..? చంద్రబాబు కష్టంతో తెచ్చిన పరిశ్రమలు జగన్ అవినీతి దెబ్బకు ఎగిరిపోతున్నాయి. ఏపీలో మేం డిగ్రీ పట్టా పుచ్చుకున్నామని చెప్పుకోవడానికి యువత సిగ్గు పడుతున్నారు. విద్యాధికులైన నిరుద్యోగ యువత.. రూ. 5 వేలకు గుమాస్తా ఉద్యోగం చేస్తున్నారు. యువతకు మంచి రోజులు రావాలంటే.. చంద్రబాబు రావాలి అని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version