ఇది కంటి వెలుగా.. లేక ఎన్నికల ప్రచార వెలుగా? – బూర నర్సయ్య గౌడ్

-

తెలంగాణ రాష్ట్రంలో ఎందుకో కొత్త జబ్బు వచ్చిందని.. అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ కంటి చూపు జబ్బు వచ్చిందని అన్నారు బిజెపి నేత బూర నర్సయ్య గౌడ్. ఎన్నికల సమయం లోనే కంటి చూపు సమస్య ఎందుకు వస్తుందో రీసెర్చ్ చేయాలని WHO ను కోరుతున్నాం అని ఏద్దేవా చేశారు. ఇది కంటి వెలుగా.. లేక ఎన్నికల ప్రచార వెలుగా అని విమర్శించారు. గత కంటి వెలుగు కార్యక్రమం లో 18 మంది అంధులు అయ్యారని ఆరోపించారు.

కంటి సమస్యలు నిరంతరం వస్తాయని ఒక్క ఎన్నికలప్పుడే రావన్నారు. ఇది కొవిడ్ లాంటి మహమ్మారి కాదన్నారు. గతంలో కొన్న మిషన్ లు ఎటు పోయాయని ప్రశ్నించారు. 50 కోట్లు కేవలం కంటి వెలుగు ప్రచారానికే ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో కూడా కంటి వెలుగు గురించి పేపర్ యాడ్ లు ఇస్తున్నారని ఏద్దేవా చేశారు. కొత్తగా ఎంత మంది కొత్త కంటి డాక్టర్ లను రిక్రూట్ చేశారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version