శ్రీకాకుళం జిల్లా బాపూజీ కళామందిర్ లో పదవ తరగతి విధ్యార్దులకు స్టడీ మెటీరియల్ పంపినీ చేశారు మంత్రి ధర్మాన. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాధరావు మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం విద్యకోసం చేస్తున్న ప్రయత్నాన్ని సమాజం గుర్తిస్తుందన్నారు. ప్రభుత్వం విద్య కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుందని తెలిపారు. పిల్లలు ఓట్లు వేస్తారని ప్రభుత్వం విద్యకు ప్రధాన్యత ఇవ్వడంలేదని.. సమాజంలో ఉన్న వ్యత్యాసాలు , ఆర్దిక అసమానతలు తోలగించాలని ముందుకు వెలుతున్నామన్నారు.
ప్రభుత్వం విశాల దృక్ఫదంతో పనిచేస్తుంటే ప్రతిపక్షాలు హేలన చేస్తున్నాయని.. సిఎం ను పిచ్చోడు, సైకో అంటూ వాక్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షనేతలు సమాజాన్ని తప్పుదోవ పట్టించి బ్రతికేస్తామని విశ్వసిస్తున్నారని ఆరోపించారు. సరైన మార్గంలో రాష్ట్రాన్ని నడిపించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటే సమాజం తిరగబడాలని పిలుపునిచ్చారు. దానికోసం కత్తి, కర్ర పట్టుకోనవసరం లేదని.. పౌరులు మంచిని గుర్తించామని సిగ్నల్ ఇస్తే చాలన్నారు. అప్పుడు సమాజాన్ని తప్పుదారి పట్టించే వారంతా తోకముడుస్తారని అన్నారు.