జగన్‌ కు ఏపీ ఉద్యోగులు షాక్‌..ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ 5 వరకు వర్క్‌ టూ రూల్‌

-

జగన్‌ కు ఏపీ ఉద్యోగులు షాక్‌ ఇచ్చారు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ 5 వరకు వర్క్‌ టూ రూల్‌ పాటిస్తామని ప్రకటించారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. కేడర్ వారీగా స్కేల్స్ కూడా నిన్న రాత్రి హడావిడిగా ఇచ్చారని.. పే స్కేల్ విషయంలో ప్రభుత్వమే సొంత ఉద్యోగులకు, మోసం అన్యాయం చేస్తుందా..? అని ఫైర్‌ అయ్యారు.

పీఆర్సీ రికమెండేషన్ ప్రకారం కాకుండా.. కరస్పాడెన్స్ పే స్కేళ్లను అమలు చేయడం దుర్మార్గం అని.. పే స్కేళ్ల విషయంలో ఇప్పటి వరకు పీఆర్సీ రికమెండేషన్లు అమలు చేయకపోవడం అంటూ జరగలేదని విమర్శలు చేశారు. పే-స్కేళ్లల్లో పీఆర్సీ రికమెండేషన్లను తొలిసారిగా పక్కన పెట్టారని.. రివైజ్డ్ పే స్కేళ్లను కూడా అమలు చేయమని కాకుండా.. అప్ లోడ్ చేశామని ఉత్తర్వులివ్వడం దారుణం అని వివరించారు.

ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా..?సంఘాలు, నాయకత్వానికి అతీతంగా ఉద్యోగులు ఈ ఉద్యమ కార్యాచరణకు కలిసి రావాలన్నారు. 2015లో ఇస్తున్న అలవెన్సులు అమలు అవుతున్నాయి.జీత భత్యాలు ఒకటో తేదీకి ఇవ్వకపోగా.. ప్రభుత్వం పే స్కేళ్లల్లో మోసాలు కూడా చేస్తోందని ఆగ్రహించారు. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు వర్క్ టూ రూల్ పాటిస్తున్నారు.ఉదయం 10 గంటల నుంచి 5.30 గంటల వరకూ మాత్రమే విధులు నిర్వహించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version