భారత్ లో రెండు రోజుల పర్యటన కోసం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. మొదటి రోజు అహ్మదాబాద్ లో పర్యటించిన బోరిస్ జాన్సన్… రెండో రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల అధికారులు, నేతల పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇదిలా ఉంటే భారత్ లో మళ్లీ పాగా వేయాలనుకంటున్న ఖలిస్తానీ గ్రూప్ గురించి బోరిస్ జాన్సన్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ కు వ్యతిరేఖంగా బెదిరింపులకు పాల్పడే తీవ్రవాదులను సహించబోమని ఆయన అన్నారు.