వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ విషయంలో పోలీసులకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు చేసిన నలుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. గుంటూరు పోలీస్ స్టేషన్ లో బోరుగడ్డ అనిల్‌కు దిండు, పరుపు వేసి రాచ మర్యాదలు చేసిన హెడ్ కానిస్టేబుళ్లు నలుగురిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు…ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కేసులో అరండల్ పేట పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది.
హెడ్ కానిస్టేబుళ్లు షేక్ గౌస్ మొహిద్దిన్ , శ్రీనివాసరావు, షేక్ సర్దార్ లపై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. పరమేశ్వరరావు అనే ఓ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ అయ్యారు. ఇక అంతకు ముందుకు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను బిర్యానీ సెంటర్ తీసుకువెళ్లిన పోలీసులపై వేటు పడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు చేసిన నలుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు.