మొన్నమొన్నటి వరకు అయితే చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే సెలవు ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో అనారోగ్య సమస్య వచ్చినా సరే సెలవు ఇవ్వడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితి ఉద్యోగికి ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది. ఆమెకి అసలు ఒంట్లో బాగోలేదు. దీనితో ఆమె తన బాస్ ని సెలవు అడిగింది. కానీ దానికి తన బాస్ నిరాకరించాడు.
నేను అస్సలు ఇంక పని చేయలేను.. నాకు అసలు ఒంట్లో బాగోలేదు అని ఆమె చెప్పింది. అప్పుడు అతను ఏమైంది అని అడిగాడు.. ఏమైందో తెలియదు కానీ కాస్త ఒంట్లో బాగోలేదు అని ఆమె చెప్పింది. అదే విధంగా జ్వరంగా కూడా ఉంది అని అంది. దీంతో తన బాస్ ఎందుకు అలా స్టుపిడ్ గా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు. అయితే నువ్వు కనుక పని చేయకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లి సిక్ లీవ్ తీసుకురావాలి లేదు అంటే ఉద్యోగం నుండి పూర్తిగా తొలగిస్తాను అని సమాధానమిచ్చాడు.
దీంతో ఆమె నేను అసలు పని చేయలేకపోతున్నాను. ఒంట్లో బాగోలేదు అని సమాధానమిచ్చింది దీంతో ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్లి సిక్ లీవ్ తీసుకురమ్మని బాస్ డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పింది రివెంజ్ తీర్చుకోవాలని ఆమె అనుకుంది. డాక్టర్ ఈమె సర్జరీ కోసం వచ్చింది పేషెంట్ కి అస్సలు బాగోలేదు ఆమెకి జ్వరంగా ఉంది రికవరీ అవడానికి రెండు వారాలు పడుతుంది అని రాశారు.
అయితే మామూలుగా అయితే ఆమెకి రెండు నుండి మూడు రోజులు సెలవు ఉంటే సరిపోతుంది. కానీ ఇలా డాక్టర్ దగ్గరికి రావడం వల్ల రెండు వారాలు పాటు ఆమెకి సెలవు దొరికింది దీంతో ఆమె రెండు వారాల వరకూ పనికి వెళ్ళక్కర్లేదు. ఇది ఇలా ఉంటే బాస్ మాత్రం ఆమెని ఉద్యోగం నుండి తొలగిస్తాను అని అనలేదు అని అబద్ధం చెప్పాడు. కానీ అక్కడ ఉన్న ఉద్యోగస్తులు బాస్ అన్నారని చెప్పేశారు. ఏది ఏమైనా ఆమెకి రెండు వారాల పాటు సెలవు దొరికింది. పైగా జీతం కూడా వస్తుంది. రెండు వారాల పాటు సెలవు కూడా. అందుకే ఆమె డాక్టర్ కి థాంక్స్ అని ఆమె చెప్పింది. ఇలా డాక్టర్ నోట్ తీసుకురావాలని అన్న బాస్ కి ఝలక్ తగిలింది.