బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. తాజాగా ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లే అవకాశాలు సన్నగిల్లాయి. ఈ మ్యాచ్ డ్రా అయినా తదుపరి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, అనుహ్యంగా ఆస్ట్రేలియా జట్టు టీమిండియాను దారుణంగా దెబ్బతీసింది. తమ పదునైన బౌలింగ్ ధాటికి భారత టాపార్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది.
దీంతో 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో ఘనవిజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జైస్వాల్ (84) మినహా పెద్దగా ఎవరూ రాణించలేకపోయారు. పంత్ (30) కాస్త కుదురుకున్నట్లు కనిపించినా అనవసరంగా భారీ షాట్లకు యత్నించి ఔటయ్యాడు. తాజా విజయంతో ఆస్ట్రేలియా 2-1 లీడ్ లోకి వెళ్లింది. మొత్తం 5 టెస్టుల మ్యాచులో ఒకటి డ్రా అవ్వగా.. రెండు ఆసీస్, ఒకటి భారత్ విజయం సాధించాయి.