శభాష్‌.. బస్సులో బాలుడికి ఫిట్స్‌.. వెంటనే డ్రైవర్‌, కండక్టర్‌..

-

ఊహించని ఘటనలు జరిగినప్పుడు కొద్దీ ఏ ఆలోచనలు రాక అక్కడే నిలబడిపోతుంటాం. అయితే.. రన్నింగ్‌ బస్సులో ఓ బాలుడికి ఫిట్స్‌ రావడంతో ఎంతో చాకచక్యంగా డ్రైవర్‌, కండక్టర్‌ తీసుకున్న నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీ బస్సులో ఓ మహిళ తన తొమ్మిదేళ్ల కుమారుడితో ప్రయాణిస్తుండగా ఆమె కుమారుడికి ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చాయి. దీంతో బస్సులోనే ఆ బాలుడు కింద పడిపోవడంతో ప్రయాణికులందరూ టెన్షన్ పడ్డారు. వెంటనే అప్రమత్తమైన కండక్టర్ వి.ఎల్. నారాయణ, డ్రైవర్.. బస్సును నేరుగా షా నగర్ లోని ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. చికిత్స చేయించడంతో బాలుడు కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోకు చెందిన బస్సు.. పెగడపల్లి నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సకాలంలో తమ కుమారుడిని ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి.. చికిత్స చేయించిన బస్సు డ్రైవర్, కండక్టర్ కు బాలుడి తల్లి కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స నుంచి కోలుకున్న తర్వాత తమ కుమారుడితో అదే బస్సులో కరీంనగర్ కు వెళ్లారు ఆ తల్లి. బాలుడి స్వస్థలం రామడుగు మండలం గోపాలరావుపేట. డ్రైవర్, కండక్టర్ చూపిన మానవత్వానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు వారికి అభినందనలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version