తమిళ్ హీరో సూర్యకు తమిళంలో తో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.తాను చేసే సినిమాలలో కమర్షియల్ సినిమాలు కంటే యదార్థ సంఘటనల కంటెంట్ తో కూడిన, ప్రజలను చైతన్య వంతులుగా చేసే సినిమాలలో ఎక్కువుగా నటిస్తారు. రీసెంట్ గా తన సినిమా ఆకాశమే హద్దురా తమిళ మూల చిత్రం దేశంలోనే ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది.
అలాగే తర్వాత తీసిన ‘జై భీమ్’ చిత్రం, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచింది.ఒక యథార్థ ఘటనని ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు జ్ఞానవేల్ మనసుకు హత్తుకునేలా ఈ సినిమాని తెరకెక్కించాడు. సూర్య నటన ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. ఈ చిత్రం కు పలు అవార్డులు రావడంతో పాటు అంతర్జాతీయ ఫిల్మ్ పెస్టివల్‌లోనూ ప్రదర్శించారు.అయితే ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో మరో సంచలన సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
జ్ఞానవేల్ కు సూర్య కు మధ్య రీసెంట్ గా చర్చలు జరిగాయని స్టోరీ లైన్ నచ్చడంతో సూర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని కోలీవుడ్ మీడియా వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం జ్ఞానవేల్‌శరవణ భవన్ హోటల్ వ్యవస్థాపకుడు రాజగోపాల్ జీవిత కథ లో జరిగిన మర్డర్ మిస్టరీనీ సినిమా గా తీయబోతున్నాడు. ఈ సినిమాకు దోశ కింగ్ అనే పేరు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది ఇక సూర్య సినిమా వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈ సంచలన కథ సినిమాగా ఎప్పుడు వస్తుందా అని సూర్య అభిమానుల ఎదురు చూస్తున్నారు.