బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేని పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించి ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటన చేశారు.రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో సేవలు అందించిన వారి మీద ఇష్టానుసారంగా, విద్వేషాలు రెచ్చగొట్టేలా వరుసగా వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎంపీ దూబే మీద ప్రధాని మోడీ, బీజేపీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన ఖురేషిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన దూబేపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన మీద చర్యలు తీసుకోకపోతే ఆయన వ్యాఖ్యల వెనుక ప్రధాని మోడీ బీజేపీ అధిష్టానం ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను అవమానపరచడం బీజేపీకి పరిపాటిగా మారిందని విమర్శించారు.