మన చుట్టూ ఉండే పరిసరాలు ఎప్పుడైతే ఎంతో శుభ్రంగా ఉంటాయో, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎంతో ప్రశాంతంగా జీవించవచ్చు. సహజంగా, ఇంట్లో శుభ్రత లేకపోవడం వలన ఎన్నో కీటకాలు, పురుగులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కిచెన్ ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో, బొద్దింకలు తక్కువగా ఉంటాయి. సహజంగా, డ్రైనేజ్, స్టోర్ రూమ్ వంటి ప్రదేశాలలో బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి వల్ల ఎన్నో ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి ద్వారా అనేక వ్యాధులు సోకే అవకాశం ఉంది. కనుక, వీటిని ఎప్పటికీ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా, తగిన జాగ్రత్తలు తీసుకుని తగ్గించాలి.
బొద్దింకలు అనేక రకాల బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతాయి. ఎప్పుడైతే వీటిని కాళ్లతో తొక్కి చంపుతారో, వాటి శరీరం నుండి ప్రమాదకరమైన బ్యాక్టీరియా బయటకు వచ్చే అవకాశం ఉంది.
సహజంగా చనిపోయిన బొద్దింకలను కొన్ని రకాల పురుగులు, చీమలు తింటాయి. ఒకవేళ, చనిపోయిన బొద్దింకలు అక్కడే ఉండిపోయినా బ్యాక్టీరియా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా, కాళ్లతో నలిపి చంపడం వంటివి చేయకూడదు. ఎందుకంటే, బొద్దింక శరీరానికి అంటుకుని, దానిలో ఉన్న గుడ్లు చల్లా చదురుగా అవుతాయి. దీంతో, బొద్దింకల బెడద మరింత ఎక్కువ అవుతుంది. బొద్దింకలు ఎక్కువగా చీకటి ప్రదేశాలలో ఉంటాయి. ఇలా ఉండడం వల్ల, వాటికి ఆహారం త్వరగా దొరుకుతుంది.
అలాంటి ప్రదేశాలలో పెస్టిసైడ్‌స్ ను స్ప్రే చేసి బొద్దింకలను నివారించాలి. ముఖ్యంగా, చేతులతో లేదా కాళ్లతో ముట్టుకోకూడదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా బొద్దింకలను నివారించవచ్చు. కిచెన్ మూలల్లో బిర్యాని ఆకులు ఉంచడం వలన, వాటి వాసనకు బొద్దింకలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా లవంగాలు, దాల్చిన చెక్క, వేపాకులను కూడా ఉపయోగించవచ్చు. బోరిక్ యాసిడ్ పౌడర్‌తో చక్కెర కలిపి, కొన్ని ప్రదేశాలలో ఉంచడం వలన, బొద్దింకలు అవి తిని చనిపోతాయి. ఇటువంటి చిట్కాలను పాటించి బొద్దింకల నుంచి విముక్తి పొందవచ్చు.