దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి దారుణ హత్య చోటు చేసుకుంది. మాట్లాడాలని గదికి పిలిచి యువతిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు స్నేహితుడు నిఖిల్. హత్య అనంతరం దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు నిందితుడు నిఖిల్. ఈ హత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు యువతి కుటుంబ సభ్యులు. అయితే… ఆ యువతితో నిఖీల్ కు ప్రేమాయాణం నడిచిందని అంటున్నారు స్థానికులు. ఈ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
https://twitter.com/bigtvtelugu/status/1966752300904386839