నర్స్ తో సెక్స్ కోసం ఆపరేషన్ ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు ఓ డాక్టర్. ఈ ఘటన 2023 సెప్టెంబర్, 16న జరిగింది. వివరాల్లోకి వెళితే…. యూకే లోని సేమ్ సైడ్ జనరల్ ఆసుపత్రిలో పాకిస్తాన్ కు చెందిన సుహైల్ అంజుమ్ వివాదంలో పడ్డారు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో రోగిని మధ్యలోనే వదిలేసి నర్స్ తో సెక్స్ కోసం వెళ్ళాడు. ఈ ఘటనపై మెడికల్ ట్రిబ్యునల్ విచారణ కొనసాగిస్తోంది. ఈ విషయం పైన డాక్టర్ అంజుమ్ తన తప్పును ఒప్పుకున్నారు.

అది చాలా దురదృష్టకరమైన రోజు అని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్ లోనే తన వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన అనంతరం చాలామంది డాక్టర్ అంజుమ్ తీరుపై ఫైర్ అయ్యారు. ఇలాంటి డాక్టర్ ను వదలకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ ను మధ్యలోనే వదిలేసి ఇలా చేస్తే ఆ రోగి పరిస్థితి ఏమవుతుంది అని ఫైర్ అవుతున్నారు. ఆ డాక్టర్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.