బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది. స్వదేశీ బూస్టర్, ఎయిర్‌ఫ్రేమ్ విభాగంతో పాటు అనేక ఇతర మేడ్ ఇన్ ఇండియా ఉప వ్యవస్థలను కలిగి ఉన్న బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది. ఈ క్షిపణి 400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలదు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ పీజే-10 ప్రాజెక్టులో భాగంగా ఈ క్షిపణిని పరీక్షించారు. ఒడిశాలోని ఐటిఆర్ బాలా సోర్ నుంచి ఈ రోజు ఉదయం 10.30 గంటలకు విజయవంతంగా ప్రయోగం జరిగింది.
దీంతో డీఆర్డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి, ఇతర సిబ్బందిని ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ అభినందించారు. బ్రహ్మోస్ ల్యాండ్-ఎటాక్ క్రూయిస్ క్షిపణి (ఎల్ఐసిఎం) మాక్ 2.8 వేగంతో ప్రయాణం చేయనుంది. అద్భుతమైన మిషన్ కోసం పనిచేసిన బ్రహ్మోస్ సిబ్బందిని డీఆర్డీఓ ఛైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అభినందించారు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భూమి మీద నుంచి ప్రయోగించవచ్చు. అదేవిధంగా, సబ్ మెరైన్ల నుంచి, యుద్ధ నౌకల నుంచి, ఫైటర్ జెట్ విమానాల నుంచి ప్రయోగించవచ్చు.